సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (08:57 IST)

చెన్నైలో కొత్తగా మరో ముగ్గురికి కరోనా..

దేశంలో కరోనా కొత్త వైరస్‌ అలజడి సృష్టిస్తోంది. తాజాగా తమిళనాడులో కొత్తగా మరో ముగ్గురికి ఈ బ్రిటన్‌ వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్ర రాజధాని చెన్నైలో కొత్త తరహా కరోనా బారినపడినవారి సంఖ్య నాలుగుకు చేరింది. 
 
చెన్నైలో బ్రిటన్‌ నుంచి వచ్చిన మరో ముగ్గురికి యూకే కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. రాధాకృష్ణ తెలిపారు. వారందరిని నగరంలోని కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
 
బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో ఇప్పటివరకు 44 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. మరో 12 మంది నమూనాలను పుణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించామని వెల్లడించారు. వారికి సంబంధించిన ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. 
 
బర్డ్‌ ఫ్లూకి సంబంధించి రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పరిస్థితులను పశుసంవర్ధకశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. బర్డ్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో కేరళ సరిహద్దుల్లో ఉన్న కన్యాకుమారి, టెన్‌కాశి, థేని, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, నిలగిరి జిల్లాల సరిహద్దులను అధికారులు మూసివేశారని చెప్పారు.