1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 మే 2016 (10:40 IST)

సోనియా తప్పుకోవడం ఉత్తమం : అమరీందర్ సింగ్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, అమృతసర్ ఎంపీ అమరీదర్  సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బాధ్యతల నుంచి సోనియా తక్షణం తప్పుకోవాలని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆమె తప్పుకొని పార్టీ పగ్గాలను రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీకి అప్పగించాలన్నారు. సోనియా వయస్సు 70 ఏళ్లకు వచ్చిందని, ఆమె పనిచేసి నీరసించిపోయారని, కాబట్టి నాయకత్వ మార్పు అవసరమని పేర్కొన్నారు. 
 
'1998 నుంచి నేను సోనియాజీతో పనిచేస్తున్నాను. ఆమె మంచి నాయకురాలు. ఆమె ఇప్పుడు 70 ఏళ్లకు వచ్చారు. నేను 74 ఏళ్లు ఉన్నాను. కాబట్టి నూతన తరం ముందుకొచ్చేందుకు ఇదే సరైన సమయం. ఆమె దేశమంతా తిరిగి పనిచేస్తున్నారు. పనిభారంతో నీరసించిపోతున్నారు. మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఆమె (నాయకత్వ పగ్గాలు) ఇతరులకు అప్పగించాలని భావిస్తే అది సముచితమేనని నేను అనుకుంటున్నా' అని ఆయన వ్యాఖ్యానించారు.