మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (21:58 IST)

లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్‌ను అరెస్ట్ చేసిన జమ్మూ పోలీస్

Jammu Police
సోమవారం జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర సంస్థ లష్కర్ ఏ తోయిబా(ఎల్ఈటీ)టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. శ్రీనగర్ శివార్లలోని పరిమ్ పొరా వద్దనున్న ఓ చెక్ పోస్ట్ వద్ద నదీమ్, మరో అనుమానితుడిని భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుంచి ఓ పిస్టోల్, ఓ గ్రనేడ్‌ను భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, కాశ్మీర్‌లో పౌరులపై మరియు భద్రతా దళాలపై పలు దాడుల్లో నదీమ్ ప్రమేయం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో లవాయ్ పొరాలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది హత్య వెనుక నదీమ్ హస్తముందని స్థానిక పోలీసులు తెలిపారు. అనేక హత్యల్లో నదీమ్ హస్తం ఉందని..అతడి అరెస్ట్ తమకు పెద్ద విజయని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఓ ట్వీట్‌లో తెలిపారు.