శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (10:36 IST)

బారాముల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - లష్కర్ కీలక నేత హతం

encounter
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లాలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బారాముల్లా సమీపంలోని మాల్వా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడ గాలింపు చర్యలకు దిగాయి. అయితే, భద్రతా బలగాలను చూడగానే ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. 
 
ఈ కాల్పుల్లో లష్కర్ తోయిబా అగ్ర కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఇద్దర ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రత్యేక పోలీస్ అధికారి, అతడి  సోదరుడు, ఓ జవాను సహా పలువురు పౌరుల హత్య కేసుల్లో కంత్రూ ప్రమేయం ఉన్నట్టు కాశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు స్వల్పంగా గాయపడినట్టు ఆయన వెల్లడించారు.