నేడు భారత్ బంద్ : పిలుపునిచ్చిన జాతీయ కార్మిక సంఘాలు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఈ బంద్ జరుగనుంది. ఇటీవల ఢిల్లీలో సమావేశమైన ఈ కార్మిక సంఘాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
కేంద్రం అనుసరిస్తున్నవి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటూ ఆ సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న అమలు చేస్తున్న విధానాలు కార్మికులను, రైతులను, ప్రజలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొంటూ రెండో రోజులపాటు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ రెండో రోజుల పాటు సాగే భారత్ బంద్‌లో రవాణా కార్మికులు, విద్యుత్ సిబ్బంది కూడా పాల్గొంటారని వెల్లడించింది.
ముఖ్యంగా, ఇటీవల ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడం, పెట్రో ధరలు మళ్లీ పెంచడం ప్రారంభించింది. మరోవైపు గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి విధానాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఈ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు పేర్కొంది.