మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

లుథియానాలో ఘోరం... ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవదహనం

fire accident
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. 
 
బుధవారం తెల్లవారుజామున లుథియానాలోని తాజ్‌పూర్‌ రోడ్డులోని ఓ గుడిసెలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉండటంతో వారంతా మంటల్లోనే కాలిపోయారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 
 
మరో కుమారుడు రాజేష్ (17) ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి సమచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ బృందంతో వచ్చి మంటలను ఆర్పివేశాయి. అయితే, అప్పటికే దంపతులతో పాటు వారి ఐదుగురి పిల్లలు మంటల్లో కాలిపోయారు. ఈ ప్రమాపదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.