శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (13:03 IST)

ట్రాన్స్‌జెండర్ల సక్సెస్ లవ్ స్టోరీ: అట్టహాసంగా ఆ ఇద్దరి వివాహం.. దాంపత్య జీవితానికి ఢోకా లేదు

ట్రాన్స్‌జెండర్లు ప్రేమించుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అవును ఇది నిజమే. అమ్మాయిగా పుట్టి పెరిగి.. పురుషుడిగా మారిపోయిన ఆరవ్ అప్పుకుట్టన్, అబ్బాయిగా పుట్టి మహిళగా మారిన సుగన్య కృష్ణన

ట్రాన్స్‌జెండర్లు ప్రేమించుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అవును ఇది నిజమే. అమ్మాయిగా పుట్టి పెరిగి.. పురుషుడిగా మారిపోయిన ఆరవ్ అప్పుకుట్టన్, అబ్బాయిగా పుట్టి మహిళగా మారిన సుగన్య కృష్ణను అట్టహాసంగా వివాహం చేసుకోబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 46 ఏళ్ల ఆరవ్ అప్పుకుట్టన్.. పుట్టుకతో అమ్మాయిగా పుట్టాడు. కానీ పెరిగే కొద్దీ అతడిలో పురుషుడు తొంగి చూశాడు. 
 
కానీ ఆరవ్‌ను పురుషుడిగా చూసేందుకు ఆతని తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఆరవ్‌ను అమ్మాయిగా పెంచాలని ఆతని తల్లి వైద్యులను సంప్రదించింది. కానీ ఆరవ్  తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. ఇంతలో ఆరవ్ తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో ఆరవ్ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాల్సి వచ్చింది. ఇలా అమ్మాయిగా పుట్టి పురుషుడిగా మారిన ఆరవ్.. తోబుట్టువుల కోసం కష్టపడాల్సి వచ్చింది. వారిని పెంచి పెద్ద చేశాక ఆరవ్... ట్రాన్స్‌జెండర్ చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించాడు. అక్కడే అసలు సీన్ మొదలైంది. 
 
అక్కడ అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన 22 ఏళ్ల సుగన్య కృష్ణను ఆరవ్ చూశాడు. ఆమెకు మలయాళం రావడంతో ఆమెతో ఆరవ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఫోన్ నెంబర్లను మార్చుకునేలా చేసింది. ఆపై ప్రేమకు దారితీసింది. చిరు ప్రాయంలో ఇద్దరూ ఎదుర్కొన్న సమస్యలను ఒకరి నొకరు పంచుకున్నారు. అయినప్పటికీ సుగన్య సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి వెబ్ డిజైనర్‌ వృత్తిలో వుంది.
 
ప్రస్తుతం ఆరవ్, సుగన్యల ప్రేమ బలపడింది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి వివాహం అట్టహాసంగా జరుగనుంది. వీరికి ముంబైలోని ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ ట్రాన్స్‌జెండర్ శస్త్రచికిత్స చేసింది. దీనిపై ధీరూబాయ్ అంబానీ వైద్యులు డాక్టర్ సంజయ్ పాండే మాట్లాడుతూ.. ఆరవ్ పూర్తిగా పురుషుడిగా మారిపోయాడని, సుగన్య కూడా మహిళగా రూపుదాల్చిందని చెప్పారు. వీరి వివాహ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వుండవని స్పష్టం చేశారు. ఫలితంగా ఈ ట్రాన్స్‌జెండర్ జంట వివాహ బంధం ద్వారా ఒకటి కానుంది.