శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 8 నవంబరు 2018 (16:49 IST)

నోట్ల రద్దుకు రెండేళ్లు... అదో బ్లాక్ డే అంటున్నారు.. ఎవరు?

నోట్ల రద్దుకు రెండేళ్లు పూర్తి అయ్యాయి. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే నవంబరు 8వ తేదీన నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించి, తన కేబినెట్ సహచరులతో పాటు మొత్తం దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు చేసిన ప్రసంగంలో.. అర్థ రాత్రి 12 గంటల నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు. 
 
నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడమే కాదు ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అరికట్టవచ్చని ప్రకటించారు మోదీ. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సమాజంపై వైపు ఒక పెద్ద ముందడుగు అని నాడు తెలిపారు మోడీ. రెండేళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన ఉద్దేశాలన్నీ నెరవేరినట్లు చెబుతున్నా, విపక్షాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అదో బ్లాక్ డేగా వర్ణిస్తున్నాయి.