1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (18:46 IST)

షీల్డ్‌కవర్లో రంజిత్ సిన్హా లోగుట్టును బయటపెట్టండి : సుప్రీం

2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌ దర్యాప్తు వ్యవహారంలో సీబీఐ డైరక్టర్ రంజిత్ సిన్హా లోగుట్టు వ్యవహారాన్ని బయటపెట్టాలంటూ ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎవరో ఏదో ప్రకటన చేశారని, దాని ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించలేమని పేర్కొంది. అందువల్ల భూషణ్ తప్పకుండా సీబీఐ డైరెక్టర్ ఇంటి అతిథుల జాబితాను వెల్లడించాలని తెలిపింది. వారి పేర్లను సీల్డ్ కవర్లో తమకు అందించాలని చెప్పింది. 
 
అయితే, ప్రశాంత్ భూషణ్ ఆరోపిస్తున్నట్లు రిజిస్టర్‌లోని 90 శాతం పేర్లు అసత్యమని, కొన్నే నిజం కావొచ్చని సిన్హా వాదించారు. ఈ మేరకు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఆయన, తనపై భూషణ్ దాఖలు చేసిన అఫిడవిట్‌ను తిరస్కరిస్తున్నానన్నారు. తనపై తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారని, అదేవిధంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.