1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (11:37 IST)

ఉత్తరప్రదేశ్ : యూపీలో భాజపా దూకుడు... మోడీ ప్రభంజనం... బంపర్ మెజారిటీ

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా బీజేపీ బంపర్ మెజార్టీ సాధించనుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఫలితంగా బీజేపీ బంపర్ మెజార్టీ సాధించనుంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొత్తం 403 సీట్లకు గాను బీజేపీ 308 సీట్లలో ఆధిక్యాన్ని చూపిస్తోంది. అధికార ఎస్పీ 65 చోట్, బీఎస్పీ 21 చోట్ల, ఇతరులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైపోయింది. 
 
మరోవైపు ఈ ఫలితాలు ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో భాజపా దూసుకుపోతోంది. రెండు రోజుల క్రితం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌లో అన్ని సర్వేలు భాజపాకే పట్టం కట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అతిపెద్ద పార్టీ ఆవిర్భవించనుందని తేల్చిచెప్పాయి. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే ఎగ్జిట్‌ పోల్స్‌ నిజంకానున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు దశాబ్దాల తర్వాత ఒక రాజకీయ పార్టీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం గమనార్హం.