శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (19:25 IST)

జూన్ 14 వరకు ఉచిత సేవలు.. ఆధార్‌లో తప్పులుంటే మార్చుకోండి..

భారతదేశ పౌరులకు ఆధార్ కార్డు తప్పనిసరి. భారత పౌరుడిగా నిరూపించుకునేందుకు ఆధార్ కంపల్సరీ. అలాంటి ఆధార్ కార్డులోని వివరాలను సరిగ్గా సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులు వున్నా వాటిని సరిదిద్దుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వుండవు. 
 
యూడీఏఐ తన ఆన్‌లైన్ పోర్టల్‌లో జూన్ 14 వరకు ఉచితంగా ఈ సేవను అందిస్తోంది. భారతీయులు ఎలాంటి ఖర్చు లేకుండా ఆధార్‌ను నవీకరించడానికి ఈ సేవను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
సో ఆధార్‌లో ఏవైనా తప్పులుంటే మార్చుకునేందుకు కేవలం ఒక నాలుగు రోజులు సమయం వుందన్నమాట. కానీ ఆధార్‌ను రిజిస్టర్ ఆధార్ సెంటర్లలో ముందులా అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఇందుకు రూ.50 చెల్లించాల్సి వుంటుంది.