శుక్రవారం, 3 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (11:25 IST)

అహ్మదాబాద్‌లో వర్షం.. రాత్రి 1 గంటవరకు టైమ్.. లేకుంటే టైటాన్స్‌కే కప్?

CSK_Titans
CSK_Titans
గుజరాత్‌లో ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సోమవారానికి వాయిదా పడింది. సోమవారం అయిన ఈ రోజు కూడా వర్షం కురిసే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
నైరుతి రుతుపవనాల ప్రారంభం కారణంగా అరేబియా సముద్రం వెంబడి కేరళ, గోవా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి భారత రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
అహ్మదాబాద్‌తో పాటు గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐపీఎల్ ఫైనల్స్ వాయిదా పడ్డాయి. గుజరాత్ విషయానికి వస్తే, అహ్మదాబాద్‌లో మేఘావృతమైన వాతావరణం, సాయంత్రం అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
 
వర్షం కారణంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకుంటే.. ఈ రోజు రాత్రి ఒంటి గంట వరకు వర్షం తగ్గకపోతే.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.