శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (11:13 IST)

మహిళతో పాటు.. మూడు నెలల పసికందును సజీవదహనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళతో పాటు మూడు నెలల పసికందును అత్తింటివారు దారుణంగా సజీవదహనం చేశారు. ఈ దారుణం యూపీలోని రాంపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాంపూర్‌లో ఓ మహిళకు నాలుగేళ్ళ కిందట వివాహమైంది. ఆమెకు మూడేళ్ళ కుమారుడుతో పాటు మూడు నెలల పసికందు కూడా ఉంది. 
 
అయితే, అదనపు కట్నం తేవాలంటూ గత కొంతకాలంగా వేధిస్తూ వచ్చారు. దీంతో కొద్ది నెలలుగా పుట్టింట్లోనే ఉంటూ వచ్చింది. బుధవారం తన సోదరిని అత్తింటివారు తమ ఇంటికి తీసుకువెళ్లి అదే రోజు ఆమెను, మూడు నెలల కుమార్తెను సజీవ దహనం చేశారని ఆ మహిళ సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
తన సోదరి షబ్నం, ఆమె కుమార్తెల గురించి అత్తింటి వారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇరుగు పొరుగు వారు ఈ ఘటనపై తమకు సమాచారం అందించారని చెప్పారు. జావేద్‌ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.