మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (18:56 IST)

ఉత్తరాఖండ్‌: పార్టీ కార్యాలయంలోనే లైంగిక దాడి.. బీజేపీ నేత దాష్టీకం

ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేత మహిళా కార్యకర్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే ఉద్యోగం సాకు చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళా కార్యకర్త పోలీసులు ఆశ్రయించింది. ఫలితంగా పార్టీ యాజమాన్యం అతనిని బాధ్యతల నుంచి తప్పించింది. 
 
వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేత, ఉత్తరాఖండ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని బల్బీర్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని వాపోయింది. 
 
ఈ ఘటన మీడియాలో రావడంతో సంజయ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.