మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (16:04 IST)

ఘోర రోడ్డు ప్రమాదం- గర్భిణీతో పాటు ముగ్గురు మృతి

road accident
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్-నైనిటాల్ హైవేపై మంగళవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు, రిక్షా డ్రైవర్‌ మృతి చెందారు. 
 
స్థానిక ఆసుపత్రిలో వైద్యపరీక్షలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న గర్భిణి సహా ఐదుగురు మహిళలు ప్రయాణిస్తున్న ఇ-రిక్షాను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. 
 
ఢీకొన్న ధాటికి ఇ-రిక్షా ధ్వంసమై, ప్రయాణికులు, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు ఈ-రిక్షా డ్రైవర్, ఇద్దరు మహిళలు వచ్చేలోగా మరణించినట్లు ప్రకటించారు. గర్భిణీ స్త్రీతో సహా ఇద్దరు మహిళలను హల్ద్వానీలోని సుశీల్ తివారీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గర్భిణీ తల్లి గాయాలతో చికిత్స పొందుతూ మరణించింది.