1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (20:01 IST)

ఉపరాష్ట్రపతి వెంకయ్య నూతన సంవత్సరం సందేశం.. ఏం చెప్పారంటే..?

నూతన సంవత్సరం వేళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు ప్రజలకు ఒక సందేశాన్ని పంపారు. 2021 ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సంధర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం మనమంతా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
 
ఇది మన స్ఫూర్తిని బలోపేతం చేస్తూ నూతన ఆశలు, ఆకాంక్షలతో భవిష్యత్ దిశగా సాగే మార్గమని.. ఆత్మ విశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంటే కొత్త పయనం ఎప్పుడు ఆశాజనకంగానే ఉంటుంది. గత యేడాది కరోనా మహమ్మారి మనకు అనేక జీవన పాఠాలు నేర్పించిందన్నారు.
 
ప్రతికూలతను అవకాశాలుగా మలుచుకునే దిశగా మనల్ని సిద్థం చేసిందని.. దానికి వీడ్కోలు పలుకుతూ సరికొత్త ఆశలతో నూతన సంవత్సరాన్ని స్వాగదిద్దామన్నారు. గత యేడాదితో పోలిస్తే 2021లో మరింత ఆరోగ్యకరమైన సంతోషకరమైన, ఉన్నతమైన ప్రపంచం వైపు సాగే దిశగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేసారు. 
 
ధైర్యం, విశ్వాసం, సంఘీభావం, నైపుణ్యాలతో భవిష్యత్తు సవాళ్ళను అధిగమించే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలో కరోనా మహమ్మారితో పోరాడేందుకు దాన్ని ఓడించేందుకు ఓ ఉన్నతమైన నిబద్ధతతో ప్రవేశిద్దామన్నారు. 
 
టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నందున 2021ని నూతన ఉత్సాహం, సానుకూలతతో స్వాగతిద్దామన్నారు. రాబోయే యేడాదిలో మన జీవితాలను అర్థవంతంగా, శాంతియుతంగా గడపగడాలాని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.