1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:49 IST)

అల్లర్లలో మృతిచెందే వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ. 5 లక్షలకు పెంపు

భారత దేశంలో అల్లర్లు, ఘర్షణలలో ప్రాణాలు కోల్పోయే వారి కుటుంబాలకు అందించే నష్ట పరిహారాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
దేశంలోని పలు ప్రాంతాలలో జరిగే కుల ఘర్షణలు, తీవ్రవాదుల దాడులు వంటి సంఘటనలలో  కొందరు అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి దాడులు, అల్లర్లు, ఘర్షణల సమయాల్లో మృతి చెందేవారికి, తీవ్రంగా గాయపడేవారికి గత 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్షలను నష్ట పరిహారంగా అందజేస్తోంది.
 
ఈ మొత్తాన్ని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. అయిదే ఇందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ అనుమతి ఇచ్చినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఆ అధికారి వెల్లడించారు.