గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (11:44 IST)

తల్లి కాదు.. రాక్షసి.. మూడేళ్ల చిన్నారిని ఎలా కొట్టిందో తెలుసా? (వీడియో)

Mother
బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. చాలా క్రూరంగా వ్యవహరించింది. తన మూడేళ్ల చిన్నారిపై ఇష్టానుసారం దాడి చేసింది. చిన్నారిని పైకి ఎత్తి నెలకేసి కొట్టి.. రాక్షస ఆనందం పొందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఛత్తీస్‌ఘడ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఆ వీడియోలో ఓ మహిళ చిన్నారిని కొడుతూ కనిపించింది. చాలా సేపు చిన్నారిని చావబాదింది. చిన్నారిని పైకెత్తి నేలపైకి కొట్టింది. తన నుంచి దూరంగా వెళ్తున్న చిన్నారిని వెంబడించి మరి దాడి చేసింది. మెడపై కాలుపెట్టి కనికరం లేకుండా ప్రవర్తించింది. 
 
అంతేకాకుండా దయ, జాలి ఏది లేకుండా కాళ్లతో తంతూ చిన్నచిన్నారిని తీవ్రంగా హింసించింది. ఆ బాధ భరించలేని చిన్నారి అరవడం హృదయాన్ని కలిచివేస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ దృశ్యాలు మనసుకు చాలా బాధ కలిగించేలా ఉన్నాయని పేర్కొంటున్నారు.