బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (17:17 IST)

నేను నిర్దోషినే.. కింగ్‌ఫిషర్ మునిగిపోవడానికి ప్రభుత్వమే కారణం: విజయ్ మాల్యా

రుణాల ఎగవేతతో స్వదేశం నుంచి లండన్‌కు పారిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్‌‍మాల్యా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ కుంటిసాకులు చెప్తున్నాడు. అంతకుముందు బ్యాంకులకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ గానీ,

రుణాల ఎగవేతతో స్వదేశం నుంచి లండన్‌కు పారిపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్‌‍మాల్యా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ కుంటిసాకులు చెప్తున్నాడు. అంతకుముందు బ్యాంకులకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ గానీ, తాను గానీ బకాయిపడినట్లు ఏ న్యాయస్థానమూ తుది తీర్పు ఇవ్వని నేపథ్యంలో తాను అమాయకుడిని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. కోర్టుల్లో నేరం రుజువయ్యేంత వరకు ఆ వ్యక్తి నిర్దోషేనని, అలాంటిది ప్రసార మాధ్యమాలు మాత్రం తనను నేరస్థుడిగా చిత్రీకరిస్తున్నాయంటూ ట్వీట్‌ చేశారు.
 
తన కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేందుకు, సంక్షోభంలో కూరుకుపోయేందుకు ప్రభుత్వ విధానాలే కారణమని మాల్యా ఆరోపించారు. ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేసి తన ఎయిర్‌లైన్స్‌కు సాయపడమని అడిగానే తప్ప రుణాల కోసం కాదని ట్విట్టర్‌లో మాల్యా పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ఎయిర్‌ఇండియాకు ప్రభుత్వం సాయపడిందని, కింగ్‌ఫిషర్‌ను పట్టించుకోలేదని మాల్యా విమర్శించారు. 
 
ఈ కారణంతోనే తన సంస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో పాటు చమురు ధరలు, సేల్స్‌ ట్యాక్స్‌, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు కంపెనీ సంక్షోభానికి కారణమయ్యాయని ఆరోపించారు. తన వల్ల ఇబ్బందులు పడ్డ ఉద్యోగులు, వాటాదార్లకు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు.