విజయ్ కాంత్ చిత్తు చిత్తు... భూతద్దంలో వెతికినా కనిపించని అడ్రెస్... మీడియాకు దొరకని కెప్టెన్
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది. ఆఖరికి డీఎండీకే అధినేత విజయ్ కాంత్ పోటీ చేసిన ఉళుందుర్ పెట్టాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘోరంగా ఓటమిపాలై, మూడవ స్థానానికే పరిమితమైపోయారు. ఎ
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కాంత్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడింది. ఆఖరికి డీఎండీకే అధినేత విజయ్ కాంత్ పోటీ చేసిన ఉళుందుర్ పెట్టాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘోరంగా ఓటమిపాలై, మూడవ స్థానానికే పరిమితమైపోయారు. ఎన్నికల పర్యటన వేళ దురుసుగా ప్రవర్తిస్తూ మీడియాకు మంచి మేత పెట్టిన విజయ్ కాంత్ పార్టీ భూతద్దం వేసి వెతికినా కనబడే స్థితిలో లేకుండా పోయింది.
ఒక్కటంటే ఒక్కచోట కూడా ఖాతా తెరవలేని దయనీయ స్థితిలోకి వెళ్లిపోయింది. వ్యవహారం చూస్తుంటే ఇక విజయ్ కాంత్ తట్టాబుట్టా సర్దుకోక తప్పదనే స్థితి కనబడుతోంది. అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తానన్న కెప్టెన్ పడవ నిట్టనిలువునా మునిగిపోయింది. అత్యధిక స్థానాల సంగతి ఏమోగానీ అసలు తను నిలబడిన స్థానాన్ని కూడా గెలవలేని స్థితికి వెళ్లిపోయాడు విజయ్ కాంత్. మరిప్పుడు మీడియా ఆయన వద్దకు వెళితే ఎలాంటి కామెంట్లు కొడతారో మరి.