శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By preethi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (10:51 IST)

ఆ సంస్థలో ప్రతి నెలా స్త్రీలకు పీరియడ్స్ మొదటి రోజు...

నేటి ఆధునిక తరంలో ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే ఉద్యోగినులందరూ ప్రతి నెలా ఎదుర్కొనే సమస్య పీరియడ్స్. ఈ సమయంలో మహిళలలో అసౌకర్యంగా అనిపించడం మొదలుకొని తీవ్రమైన నొప్పి రావడం వ

నేటి ఆధునిక తరంలో ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే ఉద్యోగినులందరూ ప్రతి నెలా ఎదుర్కొనే సమస్య పీరియడ్స్. ఈ సమయంలో మహిళలలో అసౌకర్యంగా అనిపించడం మొదలుకొని తీవ్రమైన నొప్పి రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కేరళ న్యూస్ ఛానెల్ మాతృభూమి రాష్ట్రంలోనే మొదటిసారిగా తమ సంస్థలో పని చేసే ఉద్యోగినులకు ప్రతి నెలా పీరియడ్స్‌లో మొదటి రోజును సెలవుగా ప్రకటించింది. 
 
సంవత్సరం మొత్తం 12 రోజులు అన్నమాట. ఈ నిర్ణయం పట్ల ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగినులు హర్షం వ్యక్తం చేశారు. తమపై సంస్థ ఇంత ఆదరణ చూపినందుకు సంతోషంగా ఉందని, మరింత నిబద్ధతతో పని చేస్తామని చెప్పారు. జూలై 4వ తేదీన ముంబైకి చెందిన కల్చరల్ మెషీన్ సంస్థ ఈ కొత్త సెలవుల విధానం మొదలుపెడుతున్నట్లు ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. 
 
అంతేకాకుండా ఈ విధానం దేశం మొత్తం అమలయ్యేలా చూడాలని మంత్రులు మేనకా గాంధీ మరియు ప్రకాశ్ జావేద్కర్‌కు ఆన్‌లైన్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పీటీషన్‌కు మద్దతుగా ఇప్పటికే 28000 మంది సంతకం చేసారు, 35000 సంతకాలను చేరుకోవడానికి ఇంకా 6,500 పైగా సంతకాలు అవసరం.