మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (13:39 IST)

నుదుటన సింధూరం.. ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ: కవిత

హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నుదుటన సింధూరం పెట్టుకోవడం తనకు ఇష్టమని.. అలాగే హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఏది సౌకర్యవంతంగా ఉంటుందో అదే నిర్ణయించుకోనివ్వండి.. మాకు నేర్పించకండి అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 
 
హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్.. మతమేదైనా సరే.. మనమంతా భారతీయులమే.. సింధూర్- టర్బన్- హిజాబ్- క్రాస్.. ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే. త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య అయినా సరే.. జైహింద్ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా.. సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా.. జనగణమనతో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా.. మనకు చెప్పింది ఒక్కటే.. మనం ఎవరైనా… మనమంతా భారతీయులమనే.. అంటూ కవిత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.రు.