మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 అక్టోబరు 2021 (22:58 IST)

దీపకా పడుకొనేతో భాగస్వామ్యం చేసుకున్న అంతర్జాతీయ స్పోర్ట్స్‌వేర్‌ బ్రాండ్‌ అడిడాస్‌

గ్లోబల్‌ సూపర్‌స్టార్‌, యూత్‌ ఐకాన్‌ దీపికా పడుకొనేను తమ బ్రాండ్‌ ప్రచారకర్తగా అడిడాస్‌ ఎంపిక చేసుకుంది. ఫిట్‌నెస్‌ దిశగా, అదీ శారీరక ధారుడ్యం మాత్రమే కాదు భావద్వేగాల పరంగా కూడా ఫిట్‌గా ఉండాలనే ఏకీకృత లక్ష్యం దిశగా అడిడాస్‌తో అతి సన్నిహితంగా పడుకొనే కలిసి పనిచేయనున్నారు.
 
తన జీవితంలో క్రీడలు అంతర్భాగం. వేరెవ్వరూ ప్రదర్శించలేని శక్తి, సామర్థ్యంను చూపే దీపిక, అంతర్జాతీయంగా లక్షలాది మందిని  ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఒకే తరహా విలువలను పంచుకుంటున్న అడిడాస్‌తో కలిసి ఆమె శక్తివంతమైన సహోత్తేజనం సృష్టించనున్నారు.
 
బ్రాండ్‌ యొక్క ధోరణి అయినటువంటి  ‘ఇంపాజిబల్‌ ఈజ్‌ నథింగ్‌’(అసాధ్యమన్నది లేదు)ను మరింత ముందుకు తీసుకువెళ్తూ, ఈ భాగస్వామ్యం అవరోధాలు మరియు పరిమిత అవకాశాలను దాటుకుంటూ నేటి, భావి తరాలకు స్ఫూర్తినందిస్తుంది. ఇప్పుడు పడుకొనే, అత్యంత శక్తివంతమైన మహిళా అథ్లెట్ల సరసన చేరడంతో, అడిడాస్‌ తమ స్పూర్తిదాయక వ్యక్తుల ద్వారా క్రీడను వైవిధ్యీకరిస్తుంది.
 
‘‘ఓ అథ్లెట్‌ కావడంతో పాటుగా బాడ్మింటన్‌ ఆడటమనేవి నా వ్యక్తిత్వంకు ఓ ఆకృతినివ్వడంలో అసాధారణ పాత్ర పోషించాయి మరియు నేడు నన్ను ఇలా తీర్చిదిద్దాయి. జీవితంలో మరే ఇతర అనుభవమూ అందించలేని విలువలను ఇది నాకు నేర్పింది. నేడు, ఫిట్‌నెస్‌, అది శారీరక మరియు భావోద్వేగ పరంగా ఫిట్‌గా ఉండటమనేది నా జీవనశైలిలో అంతర్భాగమైంది. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్లలో ఒకటైన అడిడాస్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను’’ అని దీపికా పడుకొనే అన్నారు.
 
‘‘గ్లోబల్‌ యూత్‌ ఐకాన్‌గా మానసిక ఆరోగ్యం మరియు శారీరకధారుడ్యం దిశగా అవిశ్రాంత కృషి చేస్తున్న దీపిక, క్రీడలు ద్వారా సానుకూల మార్పును తీసుకురావాలనే బ్రాండ్‌ యొక్క లక్ష్యంను అత్యంత అందంగా ప్రదర్శిస్తారు. అడిడాస్‌ కుటుంబంలో దీపిక చేరడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆమెతో కలిసి మరింత మంది మహిళలకు స్ఫూర్తినందించనున్నాం’’ అని సునీల్‌ గుప్తా, సీనియర్‌ డైరెక్టర్‌, బ్రాండ్‌ అడిడాస్‌, ఇండియా అన్నారు.