శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (18:18 IST)

సామా క్యాపిటల్‌- డీఎస్‌జీ కన్స్యూమర్‌ పార్టనర్స్‌ నుంచి సూపర్ బాటమ్స్ రెండు మిలియన్‌ డాలర్ల సిరీస్‌ ఏ ఫండింగ్‌ సమీకరణ

పర్యావరణ అనుకూల బేబీ ఉత్పత్తులను అందించే స్టార్టప్‌, సూపర్‌బాటమ్స్‌ నేడు తాము రెండు మిలియన్‌ యుఎస్‌ డాలర్ల సిరీస్‌ ఏ ఫండింగ్‌ను సామా క్యాపిటల్‌ మరియు డీఎస్‌జీ కన్స్యూమర్‌ పార్టనర్స్‌ నుంచి సమీకరించినట్లు వెల్లడించింది. సూపర్‌ బాటమ్స్‌ తమ మొట్టమొదటి బాహ్య క్యాపిటల్‌ 1.6 కోట్ల రూపాయలను 2018, నవంబర్‌లో సమీకరించింది.  టైటాన్‌ క్యాపిటల్‌ నేతృత్వంలోని ఈ రౌండ్‌లో స్నాప్‌డీల్‌ ఫౌండర్లు కునాల్‌ బాల్‌ మరియు రోహిత్‌ భన్సాల్‌తో పాటుగా వెంచర్‌ క్యాటలిస్ట్‌లు సైతం ఆ రౌండ్‌లో పాల్గొన్నారు. జనవరి 2020లో డీఎస్‌జీ కన్స్యూమర్‌ పార్టనర్స్‌ తోడుగా ప్రీ సిరీస్‌ ఏ రౌండ్‌కు సూపర్‌ బాటమ్స్‌ వెళ్లింది.
 
ఈ నిధుల సమీకరణ గురించి సూపర్‌బాటమ్స్‌ ఫౌండర్‌ పల్లవి ఉతగి మాట్లాడుతూ, ‘‘అధిక సంఖ్యలోతల్లిదండ్రులకు క్లాత్‌ డైపరింగ్‌ నేపథ్యం పట్ల అవగాహన కల్పించేందుకు సహాయపడే కార్యక్రమాల కోసం పెట్టుబడిగా ఈ సమీకరించిన నిధులను వాడనున్నాం. చిన్నారులకు సంబంధించి శక్తివంతమైన బ్రాండ్‌గా నిలువాలనే మా ప్రయత్నంలో భాగంగా సామా క్యాపిటల్‌ మరియు డీఎస్‌జీ కన్స్యూమర్‌ పార్టనర్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సూపర్‌బాటమ్స్‌ వద్ద మేము చాలా ఆనందంగా ఉన్నాము..’’ అని అన్నారు.
 
సామా క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆష్‌ లిలానీ మాట్లాడుతూ, ‘‘ద మామ్స్‌ కో తరువాత మేము పెట్టుబడులు పెడుతున్న రెండవ పెట్టుబడి ఇది. సామా క్యాపిటల్‌ వద్ద మేముబేబీ కేర్‌ విభాగంలో డిమాండ్‌ ఉందని నమ్ముతున్నాం. బేబీ ప్రొడక్ట్స్‌కు సంబంధించి ప్రాధాన్యతా బ్రాండ్‌గా సూపర్‌ బాటమ్స్‌ ప్రయాణంలో భాగం కావడం పట్ల ఆనందంగా ఉన్నాం’’ అని అన్నారు.
 
‘‘భారతీయులు వస్త్రాలతో తయారుచేసిన న్యాపీల వల్ల అంతర్జాతీయ స్ధాయికి భారతదేశంలో క్లాత్‌ డైపర్‌ చొచ్చుకుపోతుందని భావిస్తున్నాం. సూపర్‌ బాటమ్స్‌ ఇప్పుడు మార్కెట్‌ లీడర్‌గా తగిన స్ధానంలో ఉంది. దేశంలో బేబీ కేర్‌ విభాగంలో అవకాశాల పట్ల ఆశాజనకంగా ఉన్నాం. భారతదేశంలో బేబీ ఉత్పత్తులకు సంబంధించి  భారతదేశపు సుప్రసిద్ధ బ్రాండ్‌ నిర్మాణంలో పల్లవి, సలీల్‌కు మేము తోడ్పాటునందించడానికి ఆసక్తిగా ఉన్నాం’’ అని దీపక్‌ ఐ షహదాద్‌పురి, మేనేజింగ్‌ డైరెక్టర్‌–డీఎస్‌జీ కన్స్యూమర్‌ పార్టనర్స్‌ అన్నారు.
 
టైటాన్‌ క్యాపిటల్‌ భాగస్వామి బిపిన్‌ షా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో బేబీ కేర్‌ విభాగంలో వినూత్నమైన స్థానంలో సూపర్‌బాటమ్స్‌ ఉంది. దీనిని 2018లోనే  మేము సీడ్‌ ఇన్వెస్టర్లుగా గుర్తించాం. ఈ కంపెనీ స్థిరంగా మరిన్ని నూతన శిఖరాలను చేరగలదని మేము నమ్మకంతో ఉన్నాం’’ అని అన్నారు.