1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (10:49 IST)

డార్జిలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు... నలుగురి మృతి?

trains accident
వెస్ట్ బెంగాల్ రాష్ట్రలోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. న్యూ జల్‌పాయ్‌గురి నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలు బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. 
 
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ వెళుతున్న ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన గూడ్సు రైలు ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ రెండు రైళ్లు ఢీకొనడంతో పలు బోగీలు గాల్లోకి లేచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదా అన్నది తెలియాల్సివుంది. మరోవైపు, క్షతగాత్రులను రక్షించి సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ప్రాథమిక సమాచారం మేరకు నలుగురు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.