శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (10:57 IST)

ఆలయాలకు వెళ్లడం వల్ల వారి సమస్య ఏమిటో?: కేజ్రీవాల్

‘‘ఆలయాలను సందర్శించడంలో తప్పు లేదు. అందరూ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ దర్శనం ద్వారా శాంతి లభిస్తుంది. అయితే అందులో తప్పేముంది? కొంతమంది ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో నాకు తెలియదు? వారి అభ్యంతరం నాకు అర్థం కావడం లేదు’’ అని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

తాను రామ్, హనుమాన్ దేశాలయాలను సందర్శిస్తుంటానని కేజ్రీవాల్ వివరించారు. దేవాలయాలకు వెళ్లడాన్ని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమర్ధించుకున్నారు.

హిందుత్వ ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కేజ్రీవాల్ తన ఆలయ సందర్శనలను సమర్థించుకుంటూ, తాను హిందువునని, అందుకే వివిధ ఆలయాలను సందర్శిస్తానని చెప్పారు. తాను నిత్యం ఆలయాలకు వెళ్లడం వల్ల వారి సమస్య ఏమిటో చెప్పాలని కేజ్రీవాల్ తన విమర్శకులను కోరారు.