గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (20:57 IST)

భర్తను చంపడానికి భార్య సూపర్ స్కెచ్.. చికెన్, చపాతీలు చేసి..?

భర్త మద్యం సేవిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త విపరీతంగా మద్యం సేవిస్తున్నాడు. అంతే పక్కాగా స్కెచ్ వేసింది. మద్యం సేవించే విషయంలోనే దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 
 
భార్య, భర్తకు మరో విషయంలో గొడవలు జరుగతున్నాయి. భర్తను చంపడానికి భార్య సూపర్ స్కెచ్ వేసింది. ఇంట్లో చికెన్, చపాతీలు చేసిన భార్య ఆమె భర్తకు ప్రేమగా వడ్డించింది. మద్యం మత్తులో ఉన్న భర్త కొంచెం చికెన్ చపాతి తిన్నాడు. అంతే భర్తకు అనుమానం మొదలైయ్యింది. 
 
చికెన్ లో విషం కలిపారని గుర్తించిన భర్త ఇంటి బయటకు పరుగు తీసి పక్కనే ఉన్న బంధువులకు విషయం చెప్పి అక్కడే కుప్పకూలిపోయాడు. విషం కలిపిన ఆహారం తిన్న భర్త ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తన భర్తను ఎందుకు చంపాలని అనుకున్నానో అని భార్య స్టోరీ మొత్తం చెప్పింది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఈ ఘటన తమిళనాడు తూత్తుకుడిలో చోటుచేసుకుంది.