శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 8 జనవరి 2021 (22:01 IST)

భర్త హీరోలా వుంటాడని భార్య ఆ పని చేసింది...

మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో అరవింద్, శివకుమారిలకు సంవత్సరం క్రితం వివాహమైంది. పిల్లలు లేరు. అరవింద్ హీరోలా ఉంటాడు. శివకుమారి యావరేజ్. అయితే పెళ్ళయినప్పటి నుంచి పెద్దగా కలవలేదు భార్యాభర్తలు. రెండు చేతులా భర్త సంసాదిస్తున్నా భార్యకు సంసార సుఖం కరువైంది.
 
ఇదే విషయంలో ఇద్దరి మధ్యా తరచూ గొడవలు రేగాయి. ఈ వ్యవహారంపై భార్య శివకుమారి భర్తతో నేరుగా మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయిందట. దీంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. మళ్ళీ పెద్దలు పంచాయతీ పెట్టి ఇద్దరినీ కలిపారు. కానీ భర్తలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
 
దీంతో భార్యకు చిర్రెత్తుకొచ్చింది. అందంగా ఉండటం వల్లే తన భర్త ఎక్కడెక్కడో.. ఎవరెవరితోను తిరుగేసి వస్తున్నాడని అనుమానంతో ఎలాగైనా అతనికి అందం లేకుండా చేయాలనుకుంది. ఇంట్లో బాగా సలసలా నూనెను కాచింది. గాఢ నిద్రలో ఉన్న భర్త ముఖంపై గట్టిగా కొట్టింది. అంతే... గట్టిగా కేకలు పెట్టి రోడ్డుపైకి పరుగులు పెట్టాడు భర్త.
 
అప్పటికే అతని ముఖం సగభాగంపైన కాలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు. సంసారం సుఖం లేకుండా ఏ విధంగా తాను నలిగిపోతున్నానన్న విషయాన్ని మహిళా పోలీసులకు వివరించిందట భార్య. అయ్యో పాపం అని పోలీసులు జాలి చూపించారు... కానీ కేసు పెట్టి ఆమెను జైలుకు పంపించారు.