శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (13:18 IST)

వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయి చేరుకోనుంది.. ప్రధాని మోదీ

త్వరలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రిషికేశ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. 35 ప్రెజర్ స్వింగ్ అబ్జార్పాన్ ఆక్సిజన్ ప్లాంట్లను ఆయన జాతికి అంకితం చేశారు.
 
పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. కోవిన్‌ ఫ్లాట్‌ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి ప్రపంచానికి భారత్ ఓ మార్గాన్ని చూపించిందని అన్నారు. 
 
అతి తక్కువ సమయంలోనే వైద్య సదుపాయాలు కల్పించి భారత్ తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. మూడు వేల టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, మాస్క్‌లను దిగుమతి చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. అన్ని రంగాల్లో ఎగుమతి చేసే దిశగా భారత్ దూసుకువెళ్లుందని ప్రధాని చెప్పారు.
 
దేశవ్యాప్తంగా 92 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 95 శాతం మంది వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.