ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (10:25 IST)

పరిశ్రమ స్థాపించాలన్న మహిళ.. హేళన చేసి హర్యానా సీఎం

manoharlal
తమ ప్రాంతంలో మహిళల ఉపాధి కోసం అవకాశాల రూపకల్పన కోసం ఒక పరిశ్రమను నెలకొల్పాలన్న ఓ మహిళను భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హేళన చేసినట్టుగా మాట్లాడారు. దీంతో ఆ మహిళ చిన్నబోయింది. 
 
ఈ సందర్భంగా సీఎఁం ఖటటర్ మాట్లాడుతూ, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం తమ ప్రాంతంలో ఓ పరిశ్రమ ఏర్పాటుచేయాలని కోరిన మహిళకు... సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 'నిన్ను చంద్రయాన్‌-4 మిషన్‌లో పంపుతాం లే.. కూర్చో' అంటూ ఎగతాళి చేశారు. ఓ బహిరంగ కార్యక్రమంలో జరిగిన ఈ సంభాషణ తాలూకు వీడియో వైరల్‌గా మారింది. 
 
హిసార్‌ జిల్లాలో ప్రస్తుతం ‘జన్‌ సంవాద్‌’ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా ఖట్టర్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఖరిపై కాంగ్రెస్‌, ఆప్‌ నేతలు మండిపడ్డారు. 'హర్యానా నుంచి మధ్యప్రదేశ్‌ దాకా ప్రజలు ఈ నేతల అహానికి తగిన జవాబిస్తారు. సమయం వచ్చినపుడు వాళ్లకే చంద్రుడిని, చుక్కలను చూపిస్తారు' అని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా ట్వీట్‌ చేశారు.