సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (16:34 IST)

కన్నబిడ్డలతో.. రైలు ముందు దూసుకెళ్లిన మహిళ.. చెన్నై ఆవడిలో..?

Avadi Railway station
కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ తన కన్నబిడ్డలతో కలిసి వేగంగా వస్తున్న రైలు ముందు దూసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన చెన్నై, శివారు ప్రాంతం ఆవడి రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. చెన్నై శివారు ఆవడి-హిందూ కాలేజీ రైల్వే స్టేషన్‌లో తల్లితో పాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, ఆవడికి సమీపంలో చేక్కాడుకు చెందిన ముత్తు చెన్నై జీహెచ్‌లో ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు అద్దె ఇంట్లో తల్లి, సోదరుడితో కలిసి వుంటున్నాడు. ముత్తు విజయలక్ష్మిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 25 ఏళ్ల ఈమె పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా పూర్తి చేసింది. ఆంబులెన్స్ డ్రైవర్ అయిన ముత్తు పనిమీద చెన్నైకి వెళ్తుండటతో భార్య గృహిణిగా వుంటోంది. వీరిద్దరి మధ్య తగాదాలు వచ్చేవట. భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్ధలు ఏర్పడేవని స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తల్లితో మాట్లాడిన విజయలక్ష్మి.. మంగళవారం రైలు ముందు పిల్లలతో కలిసి దూసుకెళ్లి ఆత్మహత్య చేసుకుందని సమాచారం. 
 
ఈ ఘటనపై విజయలక్ష్మి తండ్రి నాదముని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురును చూసేందుకు ఆమె అత్తారింటికి వెళ్తే.. ఆమె సరిగ్గా మాట్లాడలేదని.. ఆమె మరణంలో అనుమానం వుందని ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. విజయలక్ష్మి తన బిడ్డలతో  కలిసి ఆత్మహత్య చేసుకుందా..? లేకుంటే రైలు ముందు ఎవరైనా తోసేశారా? అనే కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.