బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:05 IST)

సన్యాసిగా మారిన కోటీశ్వర వజ్రాల వ్యాపారి.. ఎక్కడ?

ఇటీవల వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తనకున్న ఆస్తిపాస్తులు చాలవని దేశంలోని ఓ జాతీయ బ్యాంకు నుంచి ఏకంగా 11 వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయాడు. కానీ, ముంబైకు చెందిన ఓ కోటీశ్వర వజ్రా

ఇటీవల వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తనకున్న ఆస్తిపాస్తులు చాలవని దేశంలోని ఓ జాతీయ బ్యాంకు నుంచి ఏకంగా 11 వేల కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయాడు. కానీ, ముంబైకు చెందిన ఓ కోటీశ్వర వజ్రాల వ్యాపారి మాత్రం తన రూ.కోట్ల సంపదను త్యజించి ఏకంగా సన్యాసిగా మారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన యాత్రిక్ జవేరీ టీనేజ్‌లో వజ్రాల వ్యాపారంలో అడుగుపెట్టారు. ముంబైలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తన గురువు లబ్దీ చంద్రసాగర్ బోధనలతో ప్రభావితుడైన యాత్రిక్ జవేరీ ఇప్పుడు సన్యాసం దీక్ష తీసుకున్నారు. ఈయన ముంబైలోని వాకేశ్వర్ ప్రాంతంలో సన్యాసం దీక్ష తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా వజ్రాల వ్యాపారం ద్వారా సంపాదించిన ధనాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగించానని, ఇకపై సంపాదించే జ్ఞానం ద్వారా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నానని అన్నారు. ఆయన దీక్షోత్సవానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వారంతా ఆయన సన్యాసం స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.