సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (14:03 IST)

మహానవమి రోజున మహిషాసురమర్దిని పూజ..

Durga
Durga
దేవీ నవరాత్రులలో మహానవమి చాలా ముఖ్యమైనది. నవరాత్రుల్లో తొమ్మిదవ రోజును నవమి అంటారు. ఈ రోజున మహానవమి వ్రతం ఆచరిస్తారు. తెలంగాణలో తొమ్మిదవ రోజున మహర్నవమి నాడు ఏ బతుకమ్మ పండుగ చివరి రోజు జరుపుతారు.
 
ఈరోజే బతుకమ్మలను నీటిలో వదులుతారు. కొన్ని రాష్ట్రాల ప్రజలు ఈ రోజు ఆయుధపూజ చేస్తారు. అలాగే బెజవాడలో కనకదుర్గను ఈరోజు మహిషాసురమర్దిని రూపంలో పూజిస్తారు అలాగే చక్కెర పొంగలి నైవేద్యంగా అర్పిస్తారు. ఈ రోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. దసరా తొమ్మిది రోజుల్లో పూజలు చేయకపోయినా ఈ ఒక్కరోజు వ్రతం ఆచరిస్తే నవరాత్రుల పుణ్య ఫలం దక్కుతుంది. 
 
నవరాత్రులలో అష్టమి, నవమి తిథి చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. శాస్త్రాల ప్రకారం ఈ రెండు రోజులలో అమ్మవారిని పూజిస్తే కలిగే ఫలితం నవరాత్రులంతా ఉపవాసం చేసినట్లే. 
  
ఆశ్వీయుజ శుక్ల పక్ష నవమి తిథి నవరాత్రి పండుగ ముగింపు రోజు. దుర్గ తొమ్మిదవ రూపమైన సిద్ధిదాత్రి దేవిని ఈ రోజున పూజిస్తారు. మహానవమి రోజున ఆడబిడ్డలను పూజించడం విశేషం. ఈ రోజు తొమ్మిది మంది అమ్మాయిలను భోజనానికి పిలవాలి.
 
పూజ-భోజనం తర్వాత, తొమ్మిది మంది అమ్మాయిలకు, ఒక అబ్బాయికి బహుమతులు సమర్పించాలి. నవరాత్రులంతా పూజించినంత మాత్రాన ఆడపిల్లను కానుక ఇస్తే రెట్టింపు ఫలితం లభిస్తుందని చెబుతారు. నవరాత్రుల నవమి నాడు హోమం చేయాలనే నియమం ఉంది. ఇందులో సహస్రనామాలను పఠిస్తూ అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.