సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (18:39 IST)

దసరాకు పాలపిట్టకు వున్న సంబంధం ఏంటి?

palapitta
palapitta
దసరాకు పాలపిట్టకు వున్న సంబంధం ఏంటనేది తెలుసుకుందాం. శ్రీరాముడు రావణుడిపై యుద్ధం చేయడానికి వెళ్లే ముందు పాలపిట్టను చూసి వెళ్లాడని.. అందుకే విజయం సాధించాడని పురాణాలు చెప్తున్నాయి. పండుగ రోజు పాలపిట్టను చూడటం వల్ల మనిషికి సంతోషం, అదృష్టం వరిస్తుందని విశ్వాసం. 
 
పాలపిట్టను చూడటం వల్ల మంచితనం, లాభాలు వస్తాయట. అలాగే శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత బ్రాహ్మణుడిని చంపిన పాపం మోపుతారట. దీంతో పశ్చాత్తాపం కోసం లక్ష్మణుడితో కలిసి పరమేశ్వరుడిని పూజించాడు. అప్పుడు శివుడు సంతోషించి పాలపిట్ట రూపంలో దర్శనమిస్తాడు. అందుకే దసరా పండుగ రోజు పాలపిట్టను చూడటం మంచిగా భావిస్తారు. 
 
అలాగే అరణ్య వాసం ముగించుకుని పాండవులు ఆయుధాలు తీసుకుని వెళ్తున్నప్పుడు పాలపిట్ట ఎదురుపడిందట. ఆ తర్వాత కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. అందుకే పాల పిట్ట ఎదురుపడితే అన్నింటా విజయం లభిస్తుందని నమ్ముతారు.