గురువారం పసుపు రంగు దుస్తులు... సాయిబాబాకు పాల పదార్థాలు?  
                                       
                  
                  				  గురువారం ఆలయానికి వెళ్లి పసుపు వస్త్రాలు దానం చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఇంకా  పసుపు పండ్లు, పప్పులు, పసుపుకుంకుమ మొదలైన వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి. 
				  											
																													
									  
	 
	గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తే గురుదేవుల ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయని విశ్వాసం. గురువారం విష్ణువు, బృహస్పతి ఆరాధనకు అత్యంత పవిత్రమైనది. గురువారం గురుగ్రహాన్ని, సాయిబాబాను పూజించాలి.
				  
	 
	సాయిబాబాను పూజించే వారు గురువారం పాల పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఇంకా గురు గ్రహాన్ని పూజించడం వల్ల జాతకంలో గురు గ్రహానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	గురువారం ఉపవాసం పాటించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, జ్ఞానం పెంపొందుతుంది అంతేకాదు గురు దోషం నుండి విముక్తి పొందుతారని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.