శరన్నవరాత్రులలో అమ్మవారిని ఈ పూలతో పూజించాలి
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారు రోజుకొక్క అలంకారంతో భక్తుల పూజలను అందుకుంటూ ఉంటుంది. ఈ నవరాత్రుల్లో అమ్మను సంపెంగ, మందారం, కదంబం మొదలైన పువ్వులతో పూజించాలి. మల్లెలు కూడా ఉపయోగించవచ్చు. అలాగే మంచి గంధం, అగరు, కర్పూరం వంటి షోడశోపచారములతో పూజ చేయ
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారు రోజుకొక్క అలంకారంతో భక్తుల పూజలను అందుకుంటూ ఉంటుంది. ఈ నవరాత్రుల్లో అమ్మను సంపెంగ, మందారం, కదంబం మొదలైన పువ్వులతో పూజించాలి. మల్లెలు కూడా ఉపయోగించవచ్చు. అలాగే మంచి గంధం, అగరు, కర్పూరం వంటి షోడశోపచారములతో పూజ చేయాలి. అలాగే కొబ్బరి, అరటి, నారింజ, దానిమ్మ, పనస, మొదలైన ఫలాలతో భక్య్ప- భోజ్య- లేహ్య- పానీయాలతో, అన్నపాయసాలతో, ధూప దీపాలతో, స్తోత్రాలతో, అష్టోత్తరశతనామావళిలతో, లలితా సహస్ర నామావళితో, నమస్కృతులతో తొమ్మిది రోజుల పాటు అమ్మను పూజించాలి.
ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మను పూజించేవారి సకల సంపదలు చేకూరడంతో పాటు ఈతి బాధలు తొలగిపోతాయి. సంసారిక జీవితమును సుఖ సంతోషములతో గడుపుతారు. ఎలాంటి బాధలకూ లోనుకారు. పూజ యధావిధిగా చేసి యధాశక్తిగా అన్నదానం చెయ్యాలి. పూజ చేసే వ్యక్తి ఈ తొమ్మిది రోజులు నేలపై నిద్రించాలి. విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.