శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By TJ
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2017 (18:21 IST)

దసరా రోజు ఇవి పాటిస్తే మీరు కుబేరులే...

దసరా రోజున వెండితో చేసిన లక్ష్మీదేవి, వినాయకుడు ప్రతిమను తెచ్చుకుంటే ఎంతో శుభమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. పూజా మందిరంలో వీటిని పెట్టి ప్రతిరోజు పూజలు చేయాలి. ఇలా చేస్తే తప్పక ధనప్రాప్తి లభిస్తుంది. శ్రీ యంత్రం కూడా తెచ్చుకుని పూజలు చేస్తే డబ్బు,

దసరా రోజున వెండితో చేసిన లక్ష్మీదేవి, వినాయకుడు ప్రతిమను తెచ్చుకుంటే ఎంతో శుభమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. పూజా మందిరంలో వీటిని పెట్టి ప్రతిరోజు పూజలు చేయాలి. ఇలా చేస్తే తప్పక ధనప్రాప్తి లభిస్తుంది. శ్రీ యంత్రం కూడా తెచ్చుకుని పూజలు చేస్తే డబ్బు, సుఖసంతోషాలు కలుగుతాయి. లఘు కొబ్బరికాయ.. ఇది మిగిలిన కొబ్బరికాయల కంటే చిన్నదిగా ఉంటుంది. పండుగ రోజు కొబ్బరికాయను తెచ్చి పూజా మందిరంలో పెట్టి పూజ తరువాత పసుపు బట్టలో కట్టి ఎవరిచూపు పడని చోట దీన్ని పెట్టాలి.
 
కమలం పువ్వు విత్తనాలు.. కమలం లక్ష్మీదేవి ఆశీనురాలయ్యే పుష్పం. కాబట్టి దీన్ని ఇంట్లోని పూజగదిలో పెట్టుకుంటే మంచిది. వీటిని తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి. అలాగే కుబేరుని ప్రతిమ.. కుబేరుని ప్రతిమను తెచ్చుకుని ఉత్తరాన స్థాపించాలి. ఈ ప్రతిమను పెట్టినప్పుడు రోజూ ఒకసారి శుభ్రపరచాలి. నెలసరిలో ఉన్న స్త్రీ అస్సలు ఈ ప్రతిమను ఆ సమయంలో ముట్టుకోకూడదు. 
 
అలాగే లక్ష్మీదేవి యొక్క వెండి పాదుకులను చేయించి మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో అక్కడ పెట్టుకుంటే మంచిది. గవ్వలు తెచ్చి కడిగి పూజా మందిరంలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైనది గవ్వలు. సముద్రం నుంచి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఆమెకు ఇష్టమైన గవ్వలు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది. ఇలా దసరా రోజు చేస్తే ఎంతో మంచిదంటున్నారు జ్యోతిష్యులు.