1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By TJ
Last Modified: శుక్రవారం, 18 ఆగస్టు 2017 (18:33 IST)

ఉప్పుతో దరిద్రాన్ని తరిమెయ్యవచ్చు...ఎలా!

ఉప్పు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను అధికమించవచ్చు. ఎంత కష్టపడినా కొంతమందికి ధనం నిలువదు. ఇలా రాగానే అలా ఖర్చయిపోయినా, అనుకున్న పనులకు ఆటంకాలు ఎదురైనా ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ఉప్పుతో ఇల

ఉప్పు ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంట్లోని ప్రతికూల పరిస్థితులను అధికమించవచ్చు. ఎంత కష్టపడినా కొంతమందికి ధనం నిలువదు. ఇలా రాగానే అలా ఖర్చయిపోయినా, అనుకున్న పనులకు ఆటంకాలు ఎదురైనా ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా ఉప్పుతో ఇలా చేయాలి.
 
ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా సముద్రపు ఉప్పును నీళ్ళలో వేసి ఆ నీటిలో ఇంటిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మూలమూలనా ఉన్న మురికి పోవడంతో పాటు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అలాగే ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి నైరుతి మూలన పెడితే పట్టిన దరిద్రం వదిలిపోతుందట. 
 
ఇలా రోజూ నీటిని మారుస్తూ ఉంచాలి. ఆ నీరు ఎరుపు రంగులో మారుతుందేమో గమనించాలి. అలాగే ఒక హాలులో సీసాలో కొద్దిగా ఉప్పు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచింది. బాత్ రూంలో కూడా ఒక సీసా ఉప్పు వేసి ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లోని ప్రతికూలవాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చట.