శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By CVR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (12:29 IST)

ఆరోగ్యకరమైన ఆకుకూర చిక్కెన్ కర్రీ

కావలసిన వస్తువులుః
చికెన్ - ఒక కేజీ (కావల్సిన సైజులో కట్ చేసి, ఉడికించి పెట్టుకోవాలి)
ఆకు కూర - ఒక కట్ట
ఉల్లిపాయ - ఒక చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి) 
టమోటాలు - రెండు (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - 3 - 4 (సన్నగా తరిగినవి) 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కారం - ఒక టేబుల్ స్పూన్
గరం మసాలా- ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూన్
యాలకలు - 3 లేక 4 
దాల్చిన చెక్క - చిన్న ముక్క
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
 
తయారుచేయండి ఇలా :
మొదట పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక, అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగుతున్నప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్త మిశ్రమాన్ని మరో ఐదు నిముషాలు వేగించుకోవాలి. ఇప్పుడు అందులో యాలకలు, దాల్చిన చెక్క కూడా వేసి కలుపుతూ సువాసన వచ్చే వరకూ వేగించుకోవాలి. తర్వత టమోటో ముక్కలు కూడా వేసి ఇంకా ఐదునిమిషాలు వేగించుకోవాలి. మొత్తం మిశ్రమం బాగా వేగిన తర్వాత, అందులో ముందుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకొన్న చికెన్ ముక్కలు, కారం, గరం మసాలా, ధనియాలపొడి, జీలకర్ర, ఉప్పు, మరియు ఆకుకూర (మీకు నచ్చిన ఆకుకూరను ఎంపిక చేసుకోవచ్చు) తరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసి, తర్వత రెండు కప్పులు నీళ్ళు పోయాలి. చివరిగా మూత పెట్టి 5-10నిముషాలు మీడియం మంట మీద మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ చిక్కబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి అంతే ఆకుకూర చికెన్ కర్రీ రెడీ. అతి సులభంగా తయారు చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాం. దీనిని భోజనంలోకి, టిఫిలోకి అంటూ రెండి విధాలుగానూ ఆరగించవచ్చును.