గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (19:12 IST)

3 లక్షల మంది ఇండియన్స్ ఇంటికి రావాల్సిందేనా...? బాబోయ్ ట్రంప్...

డొనాల్డ్ ట్రంప్ అభివృద్ధి చర్యల మాటేమోగానీ, ఆ దేశాభివృద్ధికి పాటుపడి చమటోడ్చిన విదేశీయులపై కక్ష కట్టినట్లు కనబడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన ఎన్నారైలను ఉన్నఫళంగా పంపేయాడనికి ట్రంప్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. బుధవారం నాడ

డొనాల్డ్ ట్రంప్ అభివృద్ధి చర్యల మాటేమోగానీ, ఆ దేశాభివృద్ధికి పాటుపడి చమటోడ్చిన విదేశీయులపై కక్ష కట్టినట్లు కనబడుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన ఎన్నారైలను ఉన్నఫళంగా పంపేయాడనికి ట్రంప్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. బుధవారం నాడు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేసింది. అంతేకాదు... ఇమ్మిగ్రేషన్ నిబంధనలను అతిక్రమించి అమెరికాలో వుంటున్నవారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అధికారం కూడా ఇచ్చేసింది. దీనితో అమెరికాలో సరైన ఆధారాలు లేకుండా వుంటున్న కోటిమందికి పైగా వలసదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 
 
వీరిలో సుమారు 3 లక్షల మందికి పైగా మన దేశానికి చెందినవారు వున్నట్లు అంచనా. తాము చర్యలు తీసుకునేదాకా పరిస్థితి తీసుకురాకుండా అక్రమంగా దేశంలో వున్నవారు వెంటనే వెళ్లిపోవాలని సూచన చేస్తోంది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. మరోవైపు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు దుందుడుకు చర్యలని డెమొక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు. 
 
ఇమ్మిగ్రేషన్ నిబంధనలను అతిక్రమించి దేశంలో వుంటున్నవారిని గుర్తించి వారిని తిరిగి తమతమ దేశాలకు పంపేయవచ్చనీ, అంతేకానీ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని తెలిపింది. ఐతే ట్రంప్ వారి మాటలను పట్టించుకునే స్థితిలో లేరనే చెప్పవచ్చు.