బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (13:20 IST)

వాణిశ్రీకి నచ్చిన నేటి హీరోలు ఎవరో తెలుసా? ఆ ముగ్గురే..? త్రివిక్రమ్ సినిమాలంటే?

అలనాటి అలనాటి తార వాణిశ్రీని అంత సులభంగా ఎవ్వరూ మరిచిపోలేరు. ఒకప్పటి అందాల హీరోయిన్‌గా.. మెల్ల మెల్లగా పొగరుబోతు అత్తగా పలు సినిమాల్లో నటించింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలతో మరపురాన

అలనాటి అలనాటి తార వాణిశ్రీని అంత సులభంగా ఎవ్వరూ మరిచిపోలేరు. ఒకప్పటి అందాల హీరోయిన్‌గా.. మెల్ల మెల్లగా పొగరుబోతు అత్తగా పలు సినిమాల్లో నటించింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలతో మరపురాని పాత్రల్లో నటించిన వాణిశ్రీ.. ఇప్పటితరం హీరోల గురించి గొప్పగా చెప్తున్నారు. ప్రస్తుతం సినీ ఫీల్డ్‌లో ఉన్న యంగ్ హీరోలు అద్భుతంగా నటిస్తున్నారని చెప్పారు. కానీ వారిలో ముగ్గురు హీరోలంటే మాత్రమే ఆమెకు చాలా ఇష్టమని వెల్లడించారు. 
 
ప్రస్తుత హీరోల్లో తనకు అల్లు అర్జున్‌, మహేష్‌ బాబు, రవితేజ అంటే చాలా ఇష్టమని వాణిశ్రీ వెల్లడించారు. వారి నటన బాగుందని ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలంటే చాలా ఇష్టమని వెల్లడించారు. తీసే సినిమాలో కొత్తదనం కోసం త్రివిక్రమ్ ప్రతీ సినిమానుకు తాపత్రయ పడతున్నారని వాణిశ్రీ వ్యాఖ్యానించారు. ఇంకా త్రివిక్రమ్ దర్శకత్వాన్ని పక్కనుండి చూడాలనిపిస్తుందని.. అతని సినిమాల్లో మానవీయ విలువలు, సంస్కృతి ఉట్టిపడుతుందని వాణిశ్రీ ప్రశంసించారు.
 
అలనాటి హీరోల్లో ఎన్టీఆర్ అందర్నీ గౌరవిస్తారని, ఏఎన్నార్ చలాకీగా ఉంటారని చెప్పుకొచ్చారు. చంద్రకళ, భానుమతి, చక్రపాణిలను ఎప్పటికీ మరిచిపోలేనని, చంద్రకళ చాలా తెలివైందని, భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆమెను చూసి ఎవరికీ భయపడని చక్రపాణి కూడా భయపడేవారని చెప్పారు. ఇక చక్రపాణి గురించి ఎంత చెప్పినా తక్కువేనని, తన కెరీర్ మొత్తంలో ఆయన సలహాలే పాటించానన్నారు.
 
తనను డీ గ్లామరస్ క్యారెక్టర్లు చేయొద్దని సలహా ఇచ్చారని, ఆయన మాటకు కట్టుబడే అలాంటివి చేయలేదన్నారు. గోరంత దీపంలో వితౌట్ మేకప్‌లో నటించినా.. జనాలు అదీ ఓ రకం మ్యాకప్ అనుకున్నారన్నారు వాణిశ్రీ. కాగా.. నవలా నాయికగా పేరు తెచ్చుకున్న వాణిశ్రీ.. అప్పట్లో కుర్రకారుకు కలలరాణిగా పిచ్చెక్కించారు. వాణిశ్రీ హీరోయిన్ గా చేసినప్పుడు.. ఆమె కొప్పు, చీరకట్టు, బ్లౌజు వర్క్ అన్నీ సెన్సేషనే. సావిత్రికి వారసురాలిగా పేరు కొట్టేసిన వాణిశ్రీ హీరోయిన్‌గా, అత్తగా, అమ్మగా పలు కీలక రోల్స్ పోషించి.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.