1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
  4. beautiful melody song from rajkumar music by Ilayaraja

కలలన్నీ నావే... కలకాలం నీవే... ఎక్కడికో తీసుకెళ్లే ఇళయరాజా...(video)

ఆ పాటలో ప్రణయం... జీవితం... వినసొంపు గీతం అది. చిత్రం : రాజ్ కుమార్ ( విడుదల- 1983). సంగీతం : ఇళయరాజా. గీతరచయిత : వేటూరి. నేపధ్య గానం : బాలు, సుశీల.

beautiful melody song
ఆ పాటలో ప్రణయం... జీవితం... వినసొంపు గీతం అది. 
చిత్రం :  రాజ్ కుమార్ ( విడుదల- 1983).
సంగీతం :  ఇళయరాజా.
గీతరచయిత : వేటూరి.
నేపధ్య గానం : బాలు, సుశీల.
 
పల్లవి :
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం... మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
 
చరణం 1:
చెలిమనసే శివధనస్సు అయినది తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది
ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని చిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్ని నావి
తొలి చుక్కవు నీవే.. చుక్కాణివి నీవే
తుదిదాకా నీవే.. మరు జన్మకు నీవే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  
 
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
 
చరణం 2 :
సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం
గతమంటే నీవే కథకానిది నీవే
కలలన్ని నావే కలకాలం నీవే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది ఇనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం... మన జీవన పారాయణం...
 
చూడండి వీడియో....
 
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
''రాధ'' రివ్యూ రిపోర్ట్: రొటీన్ స్టోరీ.. కామెడీ పండింది.. టైమ్ పాస్ కోసం చూడొచ్చు..