శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (18:32 IST)

ఈ రాశుల వారికి నలుపు తాడు కట్టుకోవడం లాభిస్తుందట!

Black rope
Black rope
చేతులు, కాళ్లకు నలుపు తాడును చాలామంది కట్టుకుంటారు. అయితే నలుపు తాడును ఈ రాశుల వారు కడితే శుభాలు చేకూరుతాయి. నల్ల తాడును ఉపయోగించేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. 
 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నల్ల తాడు, నలుపు రంగు వస్తువులు మకరం, తులారాశి, కుంభరాశి వారికి మంచిది. ఈ రాశులలో జన్మించిన వారు ఎటువంటి సందేహం లేకుండా నల్లని బట్టలు, నలుపు తాడులను ధరించవచ్చు. 
 
అయితే వృశ్చికం, మేష రాశిలో జన్మించిన వారు నలుపు రంగు తాడును ఉపయోగించకపోవడమే మంచిది. నలుపు తాడును కట్టాలి అనుకున్నప్పుడు నాలుగు ముడులు వేయండి. 
 
బ్రహ్మ ముహూర్తంలో ముందుగా రుద్ర గాయత్రీ మంత్రాన్ని జపించిన తర్వాత దానిని ధరించడం మంచిది.  లేదా ఇష్టదేవతను పూజించిన తర్వాత నలుపు తాడును ధరించడం చేయవచ్చు. 
 
అలాగే చేతిలో ఇప్పటికే పసుపు లేదా ఎరుపు తాడు ఉంటే... నల్ల తాడును ధరించవద్దని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.