శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (18:22 IST)

బంగారు ఆభరణాలను కాలికి ధరించకపోవడం మంచిది.. ఎందుకని?

శ్రీ మహాలక్ష్మీ దేవి బంగారంలో కొలువై వుంటుంది. అందుకే మహిళలు శరీరంపై ఏదైనా చిన్ని బంగారు ఆభరణమైనా ధరించి వుండాలని పెద్దలు చెప్తుంటారు. బంగారు ఆభరణాల్లో శ్రీదేవి కొలువై వుండటం ద్వారా ఆ ఆభరణాలు ధరించిన మహిళలను అనుగ్రహిస్తుందని విశ్వాసం. కానీ బంగారు నగల్లో లక్ష్మీదేవి నివసించడం ద్వారా కాలికి మాత్రం బంగారు నగలను ధరించడం కూడదు. 
 
పట్టీలు, మెట్టెలు బంగారంలో ధరించకూడదు. నడుము వరకే బంగారు నగలను ధరించాలని పండితులు సూచిస్తున్నారు. పసిడి ఆభరణాలు అందం కోసమే ధరిస్తున్నామని చాలామంది అనుకుంటారు. కానీ.. బంగారు నగలను ధరించడం ద్వారా మనశ్శాంతి చేకూరుతుంది. ధైర్యం లభిస్తుంది. బంగారానికి దృఢత్వాన్నిచ్చే శక్తి వుంటుంది. అందుకే వాటిని ధరిస్తే ధైర్యంగా వుండగలుగుతారు.
 
ఇంకా మనోబలం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం తరగదు. అలాంటి బంగారంలో లక్ష్మీదేవి వుండటం ద్వారా ఆభరణాలను నడుము వరకే ధరించడం చేయాలి. కానీ కాలికి అందెలు, మెట్టెలు వెండితో సరిపెట్టుకోవాలి. బంగారంతో తయారైన పట్టీలను కాలికి ధరించకూడదు. అలాగే కాలికి బంగారం ధరిస్తే వాతానికి సంబంధించిన నరాలను ఉత్తేజం చేస్తాయి. 
 
ఈ ప్రక్రియతో వాపు, నొప్పులు తప్పవని.. ఆయుర్వేదం కూడా చెప్తోంది. అందుచేత శరీర వాపుకు కారణమయ్యే.. ఈ బంగారాన్ని కాలికి ధరించకపోవడమే ఉత్తమమైన మార్గమని.. కాలికి బంగారం ధరిస్తే సిరిసంపదలు కూడా తరిగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.