సోమవారం, 18 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జులై 2023 (10:20 IST)

గురు పూర్ణిమ.. ఇవన్నీ చేస్తే అదృష్టం తెలుసా?

గురు పూర్ణిమ నాడు బృహస్పతి స్తోత్రాన్ని పఠించండి. జీవితంలో ఆర్థిక సమస్యలు లేదా దంపతుల మధ్య అన్యోన్యతకు ఈ రోజున శుక్ర మంత్రాన్ని జపించడం పుణ్య ఫలితాలను ఇస్తుంది. వ్యాసుడి పుట్టిన రోజైన ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. 
 
ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేసాడని శివపురాణం చెబుతోంది. ఆషాఢ పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి.  ఆషాఢ శుద్ధ పౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు. 
 
ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
 
గురు పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. విష్ణుపూజ.. శక్తి మేరకు దానం చేయాలి. పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.
 
గురుపౌర్ణమి రోజున శనగపప్పును దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు వుండవు. గోవును పూజించాలి. పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే సర్వ సుఖాలు చేకూరుతాయి. రావిచెట్టుకు పూజచేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
 
పౌర్ణమి రోజున సాయంత్రం పూట భార్యాభర్తలు కలిసి చంద్రుడిని దర్శనం చేసుకుంటే.. దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంకా తులసీ కోట ముందు నేతితో దీపం వెలిగిస్తే అదృష్టం కలిసివస్తుంది.