శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (13:11 IST)

రజస్వలకు పూర్వము భర్త సంయోగము చెందితే... ఆ గ్రంథంలో...

పూర్వ గ్రంథాలలో కొన్ని విషయాలు చెప్పబడి వున్నాయి. వీటిలో రుద్రయామిళం అనే గ్రంథాన్ని అనుసరించి ఇలా చెప్పబడి వుంది. రజస్వలకు పూర్వము భార్యతో భర్త సంభోగము చేసినట్లయితే రజస్వలాత్పరము నందు స్త్రీలకు సంభవించే గండములు పోతాయి. అలాగే భర్త పూర్ణాయుర్దాయము కలిగినవాడవుతాడు. కానీ ఇలాంటి ఆచారాలు నేడు దాదాపు లేనేలేవు.
 
ఇంకా రజస్వలకు శుభ నక్షత్రములు కూడా తెలుపడ్డాయి. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మూల, రేవతి, శ్రవణము, శతభిషము, ధనిష్ఠ, అశ్విని, పుష్యమి, రోహిణి, మృగశిర నక్షత్రముల యందు ప్రథమ రజస్వలయైనచో శుభం అని తెలుపబడి వుంది.