1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (22:34 IST)

వారాహి దేవిని కన్యారాశి జాతకులు బుధవారం పూజిస్తే..?

Varahi Matha
Varahi Matha
సప్తకన్యల్లో ఒకరైన మహా వారాహి దేవికి అనేక రూపాలు ఉన్నాయి. వారాహి దేవిని బుధవారం రోజు క్రమం తప్పకుండా పూజించిన వారికి అప్పుల బాధలు తొలగుతాయి. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో చాలా మంది అమ్మవారిని పూజిస్తారు. 
 
కానీ శ్రీ వారాహి దేవిని పూజించేటప్పుడు, అమావాస్య, పంచమి ప్రత్యేక దినాలుగా పరిగణించబడుతాయి. శత్రువులను, కర్మలను దూరం చేసే వారాహీ దేవిని పూజిస్తారు. మహావిష్ణువు అవతారంగా భావించే శ్రీ వారాహి దేవిని బుధవారం రోజు పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.
 
ఎంత డబ్బు సంపాదించినా డబ్బు ఆదా కాకపోవడం, ఎక్కువ ఖర్చు, అప్పులు పూర్తిగా తీర్చలేకపోవడం, అప్పుల కష్టాలు, తీరని అప్పుల భారం వంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారంగా వారాహి అమ్మవారి బుధవారం పూజించడం.. ఆలయానికి వెళ్లి ఆమెను దర్శనం చేసుకోవచ్చు.
 
ఒక్కో రోజు ఒక్కో గ్రహ ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులలో 6వ రాశి అయిన కన్యారాశికి బుధుడు అధిపతి. అలాగే, కాల పురుష తత్త్వం ఆధారంగా, ఆరవ ఇల్లు రుణం, శత్రుత్వం, గొడవలు, వ్యాజ్యం, వ్యాధిని సూచిస్తుంది. శ్రీ వారాహి దేవిని విష్ణుమాయ అని కూడా పిలుస్తారు. 
 
బుధవారం నాటి దైవం మహా విష్ణువు  స్వరూపం. కావున బుధుడు 6వ ఇంట కారకము వలన కలిగే ప్రభావాలను పోగొట్టుకోవాలంటే వారాహీ దేవిని దీపం వెలిగించి పూజించవచ్చు. ఈ రోజున కన్యారాశి వారు వారాహి దేవిని పూజించడం ద్వారా అప్పుల బాధల నుంచి విముక్తి పొందవచ్చు.