బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (20:20 IST)

01-02-2003 నుంచి 28-02-2023 వరకు మీ మాస ఫలితాలు

february astro
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
వ్యవహారాలు అనుకూలిస్తాయి. కార్యం సిద్ధిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. రుణ ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు లోటుండదు. తలపెట్టిన పనులు నిరాటంకంగా సాగుతాయి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సామాన్యం. భూవివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. స్వశక్తితోనే అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయక మవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. నిరుద్యోగులకు శుభయోగం. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులెదురవుతాయి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపునలో ఉంచుకోండి. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఈ మాసం అనుకూలదాయకమే. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపకాలు అధికమవుతాయి. పదవులు స్వీకరిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. భవన కార్మికులకు కష్టకాలం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను అధిగమిస్తారు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం అంత అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సందేశాలు, ప్రకటనలు నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. యోగ, ధార్మికతల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి కృషి, పట్టుదల ప్రధానం. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహపరుస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి చికాకులు అధికం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వేడుకకు హాజరు కాలేరు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మీ కష్టం వృధా కాదు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ జోక్యం అనివార్యం. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. పాత పరిచయస్తులు తారసపడతారు. పెట్టుబడులకు తరుణం కాదు. బంధుమిత్రులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ఉపాధ్యాయుకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.
 
తులారాశి : చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభదాయకమే. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఖర్చులు భారమనిపించవు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. స్వల్ప అస్వస్థతకు గురువుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగసులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. వాహనదారులకు దూకుడు తగదు.
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
వ్యవహారదక్షతతో రాణిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యవహారానుకూలత, వస్త్రప్రాప్తి ఉన్నాయి. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
ధనుర్రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా పురోగమిస్తారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సందేశాలు, ప్రకటనలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ ప్రమేయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. భూ వివాదాలు పరిష్కారమవుతతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం కొంత మేరకు అనుకూలదాయకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పనులు వేగవంతమవుతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పట్టుదలకు పోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆబాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వృత్తి ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక వ్యవహారాలతో తీరిక ఉండదు. పణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలించవు. ధనసమస్యలెదురవుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వివాహ యత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. బంధుమిత్రులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులు ఇంటర్వూల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికం.