శనివారం, 9 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (17:20 IST)

త్రిశూలంలో నిమ్మపండు ఎందుకు..? నిమ్మచెక్కలతో రాహుకాలంలో దీపం పెడితే?

నిమ్మకాయ దిష్టిదోషాలు తొలగిస్తుంది. నిమ్మకాయ ఇంట్లోని దుష్ట శక్తులను తరిమికొడుతుంది. ఇంకా మాంత్రిక శక్తులను దరిచేరనివ్వదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. నిమ్మకాయలను సగానికి కోసి కుంకుమను రాసి ప్రధాన ద్వారానికి ఇరువైపులా వుంచితే దుష్ట శక్తులు ఇంట్లోకి రావు. ఇంకా నిమ్మకాయలతో తొక్కలతో దుర్గాదేవి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
నిమ్మ చెక్కలను దీపాల్లా సిద్ధం చేసుకుని అందులో నెయ్యిని నింపి.. అరటి కాడతో తయారు చేసిన వత్తులను ఉపయోగించి దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇంకా తామర కాడలతో తయారు చేసే వత్తులను ఉపయోగిస్తే విశేష ఫలితాలుంటాయి. 
 
అంతేగాకుండా తెలుపు వెల్లుల్లి రెబ్బల చెట్ల నుంచి తీసే వత్తులతో దీపమెలిగిస్తే అదృష్టం వరిస్తుంది. ఆస్తులను పొందవచ్చు. కొత్త పత్తి వత్తులకు పసుపు రాసి వాటితో దీపమెలిగిస్తే.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఎరుపు రంగు పత్తి వత్తులతో దీపమెలిగిస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి చేకూరుతుంది. ఇంకా మాంత్రిక శక్తులను దూరం చేస్తుంది. 
 
అష్టకష్టాలు తొలగిపోవాలంటే నిమ్మచెక్కలతో నేతిని నింపి.. ఆదివారం రాహుకాలంలో దీపమెలిగించాలి. అలాగే మంగళవారం రాహుకాలంలో నిమ్మచెక్కలతో నేతిని నింపి దీపమెలిగిస్తే ఈతిబాధలుండవు. రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి. 
 
శుక్రవారం పూట రాహుకాలంలో దీపమెలిగిస్తే.. శుభఫలితాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఇంకా మాంత్రిక శక్తులను దూరం చేసేందుకు తరిమికొట్టేందుకు నిమ్మకాయను శివుని అంశగా ఉపయోగిస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దైవఫలంగా నిమ్మను పిలుస్తారు. నిమ్మకాయను త్రిశూలంలో గుచ్చడం ద్వారా రాహు కేతు దోషాలను తొలగించుకోవచ్చునని వారు సెలవిస్తున్నారు.