బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (21:47 IST)

గురువార ప్రదోషం.. వీటిని మరిచిపోకండి..

Lord shiva
ప్రదోషం వ్రతంతో శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు. కృష్ణ పక్షం, శుక్ల పక్షంలో, నెలలో రెండు రోజులు ప్రదోషం ఏర్పడుతుంది. త్రయోదశి రెండు పక్ష రోజులలో, ఈ ఉపవాసం ఆచరిస్తారు. ప్రదోష వ్రతం అక్టోబర్ 2023 తేదీలు అక్టోబర్ 11-అక్టోబర్ 12, 2023 తేదీల్లో వస్తోంది. కృష్ణ పక్షం,శుక్ల పక్షంలో త్రయోదశి తిథి 13వ రోజున ప్రదోషంగా వస్తుంది. 
 
ప్రదోష వ్రతం అనేది స్కాంద పురాణంలో చెప్పబడి వుంది. ఎవరైతే ఈ ప్రసిద్ధ వ్రతాన్ని అంకితభావంతో, విశ్వాసంతో పాటిస్తారో వారి జీవితంలో నిస్సందేహంగా ఆనందం, ధనం, మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ప్రదోష వ్రతం ఒకరి ఆధ్యాత్మికతను పెంచడానికి, లక్ష్యాలను ఫలవంతం చేయడానికి ఆచరిస్తారు.
 
శుక్ల పక్ష ప్రదోష వ్రతం, గురు ప్రదోష వ్రతం 
తేదీ: బుధవారం, 11 అక్టోబర్ 2023 
సమయం: 11 అక్టోబర్ 2023 
సాయంత్రం 5:37 నుండి - 12 అక్టోబర్ 2023 రాత్రి 07:54 వరకు
 
ప్రదోష వ్రతంలో బిల్వ పత్రాలను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. శివ పురాణ కథలను అధ్యయనం చేస్తారు. ప్రదోష వ్రత కథను వింటారు. మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తారు. శివాలయాల్లో జరిగే అభిషేకాదులను పూర్తి చేసి భక్తులు శివునిని దర్శించుకుంటారు. 
 
ప్రదోష వ్రతంలో, శివుడిని పూజించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గురువారం ప్రదోష వ్రతం తన ప్రత్యర్థులను ఓడిస్తుంది. శత్రుభయం వుండదు.